వరుస విజయాలతో టీమిండియా దూకుడు

నెదర్లాండ్స్‌పై 160 పరుగులతో భారీ విజయం
15న ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో సెవిూస్‌
ముంబై,నవంబర్‌13(జనంసాక్షి): వరల్డ్‌ కప్‌ లో టీమిండియా తన సూపర్‌ ఫామ్‌ ను కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌పై ఘన విజయంతో వరుసగా దూకుడు ప్రదర్శించింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచులన్నీ
గెలిచి అజేయంగా నిలిచింది. గ్రూప్‌ దశలో జరిగిన 9 మ్యాచ్‌ ల్లో గెలిచి ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ ఓడిపోకుండా అజేయ జట్టుగా నిలిచింది. ఆదివారం నెదర్లాండ్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో 160 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో లీగ్‌ మ్యాచ్‌ ల్లో భారత్‌ టేబుల్‌ టాపర్‌ గా నిలిస్తే.. నెదర్లాండ్స్‌ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. నవంబర్‌ 15 న ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి సెవిూ ్గªనైల్లో తలపడనుంది. 411 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ జట్టు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదర్కొంది. ఆ జట్టులో ఓపెనర్‌ బారేసి మినహా మిగిలిన వారందరూ రెండంకెల స్కోర్‌ చేశారు. తేజ నిడమానూరు 54 పరుగులు చేసి ఆ జట్టు టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. మాక్స్‌ ఒదౌడ్‌ (30) ఆకర్‌ మెన్‌ (35), సైబ్రాండ్‌ (45) పోరాడినా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేక పోయారు. దీంతో ఆ జట్టు 250 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా , సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, జడేజా తలో రెండు వికెట్లు తీసుకోగా.. కోహ్లీ, రోహిత్‌ లకు తలో వికెట్‌ లభించింది. అంతకు ముందు మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 410 పరుగులు చేసి భారీ స్కోర్‌ చేసింది. అయ్యర్‌, రాహుల్‌ సెంచరీలు తోడు కోహ్లీ(51), గిల్‌(51), రోహిత్‌(61) అర్ధ సెంచరీలు చేశారు. అయ్యర్‌ 94 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్సులతో 128 పరుగులు చేస్తే.. రాహుల్‌ 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడారు.

తాజావార్తలు