వసతి గృహాలకు గార్డియన్‌ అధికారుల నియామకం

శ్రీకాకుళం, జూలై 31 : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలకు గార్డియన్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ నియమించారు. సాఘిక సంక్షేమ, వెనుకబడిన సక్షేమ వసతి గృహాఆలు జిల్లాలో 141 ఉన్నాయి. వీటన్నింటికీ మండల స్థాయి అధికారికి తక్కువకాని అధికారులను నియమించారు. తహశీల్లార్లు, మండల అభివృద్ధి అధికారులు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, సీడీపీవోలు, మండల వ్యవసాయధికారులు, మండల విద్యా శాఖాధికారులను నియమించారు. ఎవరికి ఏ వసతి గృహాన్ని కేటాయించారో సంబంధిత జాబితాను విడుదల చేశారు. ఆగస్టు నెల నుంచి వీరంతా వసతి గృహాలను పర్యవేక్షిస్తుంటారు. ప్రతి గురువారం విధిగా విద్యార్థులతో రాత్రి 8 నుంచి 9 గంటల వరకు మాట్లాడి రాత్రి బస చేస్తారు.