వీఐటీ ఆధ్వర్యంలో ‘గ్రావిటాన్’ వేడుకలు
వేలూరు: వీఐటీ ఆధ్వర్యంలో గ్రావిటాన్ వేడుకలనుకోలాహలంగా నిర్వహించనున్నట్లు వర్సిటీ కులపతి జి. విశ్వనాధన్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తమవిద్యతో పాటు విద్యార్థులను వివిధ రంగాల్లో ప్రావీణ్యులను చేసే దిశగా వీఐటీ ప్రోత్సాహం అందిస్తోందన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంలో భాగంగా 14, 15 16 తేదిల్లో గ్రావిటాన్ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రావిటాన్‌కు ముందుగా 8, 9 తేదీల్లో వర్సిటీ ఆవరణలో గ్రీన్‌ఎనర్జీ పేరిట భూతాపం తగ్గించాలంటే పచ్చదనాన్ని ఎలా పరిరక్షించాలన్న విషయంపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.



