వైఎస్‌ఆర్‌పై పోస్టర్‌ విడుదల

విజయనగరం, జూలై 5 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా శాఖ గురువారం ఇక్కడ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. స్థానిక అవనాపు సోదరుల ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లా కన్వీనర్‌ సాంబశివరాజు ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూలై 8వ తేదీన రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్రమాన్ని అన్ని చోట్ల ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగావ సాంబశివరాజు పిలుపునిచ్చారు. సామావేశంలో పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్‌ మాట్లాడుతూ తమ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా జగన్మోహన్‌రెడ్డిపై ప్రభుత్వ చర్యలకు నిరసనగా విగ్రహాల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గండికోట శాంతి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.