సుడోకో సృష్టికర్త మృతి


టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రముఖ పజిల్‌ గేమ్‌ సుడోకోను సృష్టించిన మాకి కాజి(69) బైల్‌ డక్ట్‌ క్యాన్సర్‌తో మృతి చెందారు. టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాకి కాజిని గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ సుడోకోగా పిలుస్తారు. నెంబర్స్‌తో పజిల్‌ను తయారు చేసిన ఆయన.. సుడోకో ఆటలో 1 నుంచి 9 మధ్య నెంబర్లను.. అడ్డం, నిలువుగా.. రిపీట్‌కాకుండా ప్లేస్‌ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌ జపాన్‌ లోనే కాకుండా ఇతర దేశాల్లోని బాగాప్రాచుర్యం పొందింది. మనిషి బ్రేయిన్‌ ను షార్ప్‌ చేసేలా ఆ గేమ్‌ ఉంటుంది. 2006 నుంచి ఈ గేమ్‌ పై చాంపియన్‌ షిప్‌ కూడా నిర్వహిస్తున్నారు. మాకి కాజి.. నిఖోలిని కంపెనీనికి కాజి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కూడా ఉన్నారు.