అంగరంగ వైభవంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పణ

మోమిన్ పేట జూలై 11 జనం సాక్షి
మోమిన్ పేట మండల పరిధిలోని చిన్న కోల్కుంద గ్రామంలో మంగళవారం బోనాల పండుగ అంగరంగవైభవంగా నిర్వహించడం జరిగిందని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సర్పంచ్ కొనింటి సురేష్ తెలిపారు. బోనం కుండలకు వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరించి, కుండపైన ఓ దీపంతో మహిళలు నెత్తిన పెట్టుకుని.. పోతురాజులు, మేళ తాళాలతో, డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి.. బోనం కుండలను అనగా తెలంగాణ సంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేసి బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవత అయిన మైసమ్మకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించిన అనంతరం తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనింటి బోనాలను సమర్పిస్తే అమ్మవారు శాంతించి అంటువ్యాధులు రాకుండా దీవిస్తారని భక్తుల నమ్మకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగన్న, ప్రవీణ్, యాదయ్య, రాజు, అశోక్, రాచప్ప, నర్సింహులు, రాజయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు