అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

ఈరోజు హైదరాబాద్ లోని హిమాయత్ నగర్,నారాయణ గూడ, కుబేర టవర్స్ IVF రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ – తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గుప్త గారితో కలిసి అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.రాష్ట్ర కమిటీ సభ్యులందరికి 77 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి,నివాళులర్పించారు.తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా..టూరిజం చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ 77 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..తెలిపారు. రెండు శతాబ్దాలకు పైగా బ్రిటీష్‌వారి చెరలో మగ్గిన మనకు ఎందరో మహానుభావుల త్యాగఫలంతో ఆగస్టు- 15,1947 న స్వాతంత్య్రం సిద్ధించింది. భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను మరియు ఇంతటి గొప్ప స్వతంత్ర దేశాన్ని మనకందించిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆ మహనీయుల ఆశయాల సాధనకు, రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దాం అని తెలిపారు.అటువంటి వారి స్పూర్తితోనే తెలంగాణా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన యావత్ భారత దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో.. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్ IVF తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, ట్రెజరర్ కోడిప్యాక నారాయణ గుప్త,IVF తెలంగాణ స్టేట్ అడ్వైసర్ ముస్త్యాల సత్తయ్య,ఉడుత పురుషోత్తమ్, IVF తెలంగాణ యూత్ అధ్యక్షుడు కట్ట రవికుమార్ , ఐవిఎఫ్ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు నరేష్ గుప్త,యూత్ సెక్రటరీ మార్త వీరేందర్,IVF ప్రతినిధులు, నాయకులు మరియు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు