అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు
ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి పట్టణంలోని బిజెపి సీనియర్ నాయకులు పత్రిక ప్రకటన ద్వారా అణగారిన, అట్టడుగు వర్గాల అభివృద్ధిని, ఆశయాలకు తూట్లు పొడుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బిఆర్ఎస్ పార్టీ యస్సీ కులాల అభివృద్ధిని అంకెల్లో చూపిస్తూ ఉండడానికి పెంకుటిల్లును సైతం ఇవ్వటం లేదు. దళిత బంధు పేరు పేపర్లలో ఉంటుంది కానీ పేద యస్సీల జీవితాల్లోకి వచ్చి వెలుగులు నింపడం లేదు. అబద్ధపు హామీలతో ఈ BRS పార్టీ ప్రభుత్వం యస్సీలను ఆశలపల్లకిపై తిప్పుతుందే తప్ప దళిత సమాజానికి చేసింది శూన్యం,యస్సీల ఓట్లను కొల్లగొట్టేందుకు చూస్తున్నారు. తప్ప మీ ఆదర్శాలను అనువంతైన సాక్షాత్కరించడంలో ఈ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కనీసం ఆలోచించటం లేదు. ఈ BRS/TRS ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి యస్సి సమాజాన్ని చిన్నచూపు చూస్తుంది. ఈ BRS పాలనలో యస్సీల అభివృద్ధికై, సంక్షేమ పథకాల అమలుకై ప్రభుత్వ అధికారులకు పలుమార్లు విన్న వించుకున్న ఈ BRS పాలకుల్లో చలనం లేదు. కావున గత్యంతరం లేని ఈ యస్సి సమాజం మీ దివ్య సన్నిధికి చేరుకుంది.అయ్యా.! అంబేద్కరా యావత్ యస్సీ సమాజ అభివృద్ధిని కాంక్షించే ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా వారికి బుద్ధిని ప్రసాదించాలని తమరి పాదాల చెంత ఈ వినతి పత్రాన్ని సమర్పిస్తూ, ప్రాదేయపడుతున్నాముఇందుమూలంగా తమరికి విన్నవిస్తున్న విషయాలు:
అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలి. (ఎంపిక ప్రక్రియలో పార్టీల పక్షపాతం లేకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో ఈ పూర్తి ప్రక్రియ జరగాలి)అర్హులైన పేద యస్సీలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి.డప్పు కొట్టేవారికి, చెప్పులు కుట్టే వారికి రూ.5000/- పెన్షన్ ఇవ్వాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కడారి గంగాధర్, జిల్లా అధ్యక్షుడు ఎలాగుర్తి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఓరగంటి చంద్రశేఖర్, బిజెపి జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్, కిషన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బండారు లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ధర్మపురి బిజెపి పట్టణ అధ్యక్షుడు బెజ్జారపు లవన్, బిజెపి మండల అధ్యక్షుడు సంగెపు గంగారం, తుమ్మెనాల ఎంపీటీసీ ఆకుపత్తిని తిరుపతి, సీనియర్ నాయకులు నలుమాసు వైకుంఠం, పల్లెర్ల సురేందర్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి విజయ్,బీజేవైఎం మండల అధ్యక్షుడు గాజు భాస్కర్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు నరేడ్ల శంకర్, గాజుల రామదాసు, దివిటి శ్రీధర్ కాసెట్టి హరీష్ , పోతు వెంకటేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.