అక్షరాస్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కర్నూలు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): అక్షరాస్యతా శాతం పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు, విద్యావంతులు కృషి చేయాలని వయోజన విద్య జిల్లా ఉపసంచాలకులు జయప్రద అన్నారు.ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోసిగిలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలోనే కోసిగి మండలం విద్యాప్రమాణాల్లో వెనుకబడి ఉందన్నారు. ప్రస్తుత అక్షరాస్యత 33 శాతం మాత్రమే ఉందని తెలిపారు. రాబోయే కాలంలో జిల్లాలోనే అక్షరాస్యతా శాతంలో ముందుండాలని అధికారులకు, ఉపాధ్యాయులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వరలక్ష్మి, గ్రామసర్పంచి ముత్తురెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు