అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం – మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా
మంథని మండలం పుట్టపాక గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్యూట్ జరిగి సర్వం కోల్పోయిన యం.డి. షఫీ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. విద్యుత్ షార్ట్ సర్యూట్ జరుగడం వలన షఫీ కుటుంబం విలువైన ఆస్తి పత్రాలు, బంగారం, వెండి, రెండు మోటారు సైకిళ్లు, నిత్యావసరాలు, ఇతర వస్తువులు నష్టపోయాడు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి గురువారం 50 కిలోల బియ్యాన్ని అందించారు. సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ఓదార్చి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ఎక్కటి అనంత రెడ్డి, జెడ్పీటీసీ తగరం సుమలత శంకర్ లాల్, సర్పంచ్ రొడ్డ మమత శ్రీనివాస్, ఎంపిటిసి పెగడ శ్రీనివాస్, సింగిల్విండో డైరెక్టర్ ఆకుల రాజబాపు, గ్రామ శాఖ అధ్యక్షుడు రొడ్డ మల్లయ్య, యూత్ అధ్యక్షుడు కన్నూరి సుదర్శన్, మాజీ సర్పంచ్ కల్వల రాజేశం, వార్డు సభ్యుడు కొండపర్తి కుమార్, నాయకులు శీలం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.