అట్టహాసంగా తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ
కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 14 :తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మరో రాజకీయ పార్టీ అవతరించింది. డైమండ్ పాయింట్ లోని శ్రీ రాజ రాజేశ్వరి గార్డెన్ లో మాజీ కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ పుంజాల శివశంకర్ తనయుడు డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ శుక్రవారం తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, పార్టీ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్.పి.వినయ్ కుమార్ మాట్లాడుతూ తండ్రి శివశంకర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మా తండ్రిగారు చాలా విలువలను ఇచ్చారు అన్నారు.
తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఒక అవకాశం ఇవ్వండి మీ జీవితాలను మార్చేస్తానంటున వినయ్ కుమార్ తెలియజేశారు.హైదరాబాద్ విస్తీర్ణం ఆపేసి జిల్లాల అభివృద్ధికి దృష్టి సారిస్తామని,రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఉచిత విద్య, వైద్యం,ఉద్యోగ, ఉపాధి కల్పించటం రాజ్యాధికారంలో మహిళలను భాగస్వాములను చేయడం, రైతుల సంక్షేమాన్ని సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ సమాజ కాంగ్రెస్ పని చేస్తుందని డాక్టర్.పి.వినయ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి అతి త్వరలో జరగనున్న ఎన్నికలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయటమే తెలంగాణ సమాజ కాంగ్రెస్ ఏకైక లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థపాక అధ్యక్షులు డా.పుంజాల వినయ్ కుమార్ స్పష్టం చేశారు. చట్ట సభలలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు ఎక్కువ సీట్లను గెలుపొందే లక్ష్యంతోనే తెలంగాణ సమాజ కాంగ్రెస్ ను స్థాపించినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయడమే తెలంగాణ సమాజ కాంగ్రెస్ ఏకైక లక్ష్యమని ప్రకటించారు.ఈ కార్యక్రమానికి డి.నరహరి అధ్యక్షత వహించారు. వినయ్ కుమార్ మాట్లాడుతూ ఆత్మ బలిదానం చేసుకున్న తొలి,మలి దశ ఉద్యమకారుల సంక్షేమ కోసం తెలంగాణ సమాజ కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఉద్యమకారులను ప్రభుత్వం పక్కన పెట్టిందని, దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ మాట తప్పిండని, రైతుల భూములు గుంజుకొని, హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సి,ఎస్టి,బిసి మైనారిటీ లను కాపాడుకునే బాధ్యతను తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. జిల్లాలను అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు కల్పించి అందరికి మెరుగైన వైద్యం అందిస్తామని, రైతులు అప్పుల బారిన పడకుండా ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆదుకుంటుందని వినయ్ కుమార్ హామీ ఇచ్చారు. రాజ్యాధికారంలో మహిళలను భాగస్వాములను చేయడమే తెలంగాణ సమాజ కాంగ్రెస్ లక్ష్యమని పుంజాల వినయ్ కుమార్ అన్నారు.బిసి ముఖ్యమంత్రే నినాదంతోరాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం,రాజ్యాధికారంలో మహిళలను భాగస్వాములను చేస్తాం. ప్రపంచంలో అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహం సెక్రటేరియట్ వైపు ఎలా చూస్తుందో అదే విధంగా బడుగు బలహీనవర్గాలను సెక్రటేరియట్ లో కూర్చో పెట్టాలి అన్ని వినయ్ కుమార్ అన్నారు.అంతకు ముందు బిసిని ముఖ్యమంత్రి చేయాలని, తదితర తీర్మానలను చంద్రశేఖర్ రెడ్డి,విద్యార్థి సంఘం నాయకుడు గౌతం, డాక్టర్ లక్ పతి భూక్యా నాయక్, నరహరి తదితరులు తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.ఇదిలావుండగా ఆవిర్భావ సభకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి రావటం విశేషం.ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకర్శించాయి.
ఈ కార్యక్రమంలోపుంజాల శాశ్వత శంకర్, డి.నరహరి,ఉప్పలసత్యనారాయణ,జి.గంగా ధర్,ఆర్.చంద్రశేఖర్,ఎం వేణు,ఆర్. విజయేందర్, సిహెచ్ సంతోష్ కుమార్, ఏ.మహేష్ నవీన్ కుమార్, విజయ్,రవికుమార్,డాక్టర్. లక్ పతి భూక్యా నాయక్ , కే.గౌతమ్, డాక్టర్. ఏ.సత్యనారాయణ, ఓరుగంటి వెంకటేశ్వర్లు, కె.గౌతమ్,అనికేత్,రామారావు మెట్టు,రమేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.