అత్యాచారాలపై గళమెత్తిన ప్రజలు
రాష్ట్రంలో నిరసనలు, ర్యాలీలు
అమరావతి,మే7(జనం సాక్షి): ఎపిలో అత్యాచారలాకు వ్యతిరేకంగా నిరసనలు ¬రెత్తాయి. ఎక్కడిక్కడే నిరసనలు,ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో పూసపాటి రేగ జాతీయ రహదారి పై ఆడ బిడ్డలకు రక్షణ ఇద్దాం.. అంటూ సోమవారం తహశీల్దార్ జి.సూర్యలక్ష్మీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. మండల పరషత్ కార్యాలయం నుండి రాజవీది విూదుగా హై వే వరకు ర్యాలీ చేసి మానవహారంలో నిర్వహించారు. దాచేపల్లి ఘటన అందరిని కడిలించిదని ఎంపీపీ మహంతి చిన్నం నాయుడు అన్నారు. మానవహారంలో జెడ్పీటీసీ సభ్యులు అకిరి ప్రసాదరావు, సర్పంచ్ పి సన్యాసి నాయుడు, ఎంపిడిఓ ఎమ్మెల్ నారాయణరావు,ఎంఈఒ జి.స్. ప్రకాశరావు, ఎపిఒ కిరణ్మయి, ఏపీఎం అర్చుట్ రావు,జెఈ శ్రీనివాస రావు, ఏఈ మురళి మోహన్,సిడిపిఒ ధనలక్ష్మి, ఎస్ ఐ జి. కళాధర్, ఉద్యోగ, ఉపాధ్యాయ, మహిళలు పాల్గొన్నారు. కడప జిల్లాముద్దనూరులో ఆడపిల్లకు రక్షణగా ముందుకు కదులుదాం ర్యాలీని మండల అధికారులు నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేసి మానవహారంగా నిలిచారు. ట్రైనీ ఏ ఎస్పీ వకులు జిందాల్,ఎంపిడిఓ మనోహర్
రాజు,తహసీల్దార్ ఉదయ్ సంతోష్,సీడీపీఓ హైమావతి, ఎస్ ఐ నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనం నుండి రిమ్స్ వరకు ఆడబిడ్డకు రక్షగా కదులుదాం నినాదంతో జరిగిన అవగాహన ర్యాలీలో రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు శ్రీ శిద్దా రాఘవ రావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ , ఎమ్యెల్సి పోతుల సునీత , జిల్లా ఎస్పీ బి. సత్య ఏసుబాబు , సంయుక్త కలెక్టర్ యెస్. నాగలక్ష్మి,రెండవ సంయుక్త కలెక్టర్ డి. మార్కండేయులు , జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాజా వెంకటాద్రి , రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యులు రమాదేవి , జిల్లా అధికారులు,స్వయం. సహాయక సంఘాల మహిళలు, విద్యార్థిని విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.