అత్యాచార ఘటనపై చట్టాలు కఠినం కావాలి
బాధితురాలికి కోడెల పరామర్శ
గుంటూరు,మే5(జనం సాక్షి ): గుంటూరు జిల్లా దాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలికను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన ఆయన.. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఇలాంటి ఘటనలను ఖండించాలని అన్నారు. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే చట్టాల అమలు ఇంకా పదునుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అందరూ అప్రమత్తమై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడాలన్నారు. సమాజం ఏం కోరుకుందో నిందితుడికి అదే శాస్తి జరిగిందని అన్నారు. ఈ ఘటనలో చిన్నారి బాధితురాలే కానీ బాధ్యురాలు కాదని.. ఈ సమయంలో ఆమెకు సానుభూతి కాదు… మనోధైర్యం కావాలన్నారు. దాచేపల్లి ఘటనలో ప్రభుత్వ తక్షణమే స్పందించిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘోరాలు జరగకుండా ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోడెల సూచించారు. ఇలాంటి మృగాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు తగ్గట్లుగా చర్యలు ఉండాలన్నారు. సభ్యసమజాం తలదించుకునేలా జరిగే ఇలాంటి ఘనటలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి అడ్డుకోవాలన్నారు.
—–