అదృశ్యమైన బాలికలను ఇంటికి చేర్చిన పోలీసులు.
మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 10.
మంచిగా చదువుకోకుంటే హాస్టల్లో చేర్పిస్తానని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పడంతో భయపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం. సంతోషిమా నగర్ లో నివాసముంటున్న పుట్ట ఇందు (13) మల్కాజిగిరి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కోడూరు లఖిత (6) ఇద్దరు కలిసి ఆదివారం ఉదయం 11:30 గంటలకు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు.దీంతో కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల దగ్గర వెతికిన ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.సిద్దిపేటలోని బాలసదన్ లో బాలికల ఆచూకీ లభించింది.పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చి బాలికలను విచారణ చేయడంతో తమ తల్లిదండ్రులు మంచిగా చదవకపోతే హాస్టల్ లో వేస్తామని బెదిరించడంతో ఇంతకుముందు చదివిన బాల సదన్ హాస్టల్ కు బస్సులో వెళ్లామని తెలిపారు.
అదృష్టమైన బాలికలను 24 గంటలలో పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు.