అధ్యాపకులపై నిర్భయ కేసు నమోదుఅధ్యాపకులపై నిర్భయ కేసు నమోదు
ఏలూరు,డిసెంబర్15(జనంసాక్షి): ఉపాధ్యాయ వృత్తికే అవమానం తెచ్చేలా ప్రవర్తించిన ప్రిన్సిపాల్, లెక్చరర్‌పై కేసు నమోదయ్యింది. వీరు చేస్తున్న వికృత చేష్టల కారణంగా పలువురు కళశాల మానేశారు. చివరకు ఒకరిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే ..విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదుతో పశ్చిమగోదావరి జిల్లా దుంపగడప ఏకేపీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌పై గురువారం రాత్రి నిర్భయ కేసు నమోదైంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఫిర్యాదు ఆధారంగా ప్రిన్సిపల్‌తోపాటు మరో అధ్యాపకుడి పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం కళాశాలకు వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో విద్యార్థినులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా తమ పట్ల తెలుగు అధ్యాపకుడు జాన్‌వెస్లీతో పాటు కళాశాల ప్రిన్సిపల్ ఎం.వరప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తిసున్నారని తెలిపారు. ఇప్పటికే అనేకమంది కళాశాలకు రావటం మానేశారని, మరికొందరు టీసీలు తీసుకొని వెళ్లారని చెప్పారు. విషయం ఇంటి వద్ద చెబితే చదువు మాన్పిస్తారని తాము చెప్పలేదని వాపోయారు. ఆ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆకివీడు ఎస్సై సుధాకర్‌రెడ్డి కళాశాలకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. జరిగిన ఘటనలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వండతంఓ కేసు నమోదు చేశారు. ఇంతజరిగినా కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్ మాత్రం మాటమారుస్తూ ,బుధవారం తాను కళాశాలకు సెలవు పెట్టానని, అదే సమయంలో తెలుగు అధ్యాపకుడు జాన్‌వెస్లీ తరగతి గదిలో అసభ్యకరంగా ప్రవర్తించారని నేరాన్ని అతనిపై నెట్టే ప్రయత్నం చేశారు. తాను ఏ తప్పుచేయలేదని ప్రిన్సిపాల్ అంటే, కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలుగు అధ్యాపకుడు జాన్‌వెస్లీ చెప్పారు. మొత్తానికి వీరిద్దరిపై కేసు నమోదు కావడంతో అరెస్ట్ చేయడం తప్పనిసరి కానుంది.