అనంతపురం: పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

కళ్యాణదుర్గం, ఆగస్టు 24 : బ్రహ్మసముద్రం మండలం కపటలింగనపల్లెలో పొరుగింటి వారితో ఉన్న వివాదంపై పోలీసుస్టేషనుకు వెళితే తనను పిచ్చివాడిగా చిత్రీకరించి ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారనే మనస్థాపంతో ఓ యువకుడు కళ్యాణ దుర్గం సర్కిల్‌ కార్యాలయంలో కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

తాజావార్తలు