అనుపురం గ్రామంలో డ్రైడే నిర్వహణ
వేములవాడ రూరల్, జూలై 7(జనంసాక్షి) :
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ లో భాగంగా అనుపురం గ్రామంలో శుక్రవారం డ్రై డే నిర్వహించారు. ప్రత్యేక అధికారి ఆకుల శ్రీనివాస్ గ్రామంలోని ఇండ్లలో నిలువ ఉన్నటువంటి నీటిని గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా తొలగించారు. మురికి నీరు నిల్వ వల్ల దోమల వృద్ధి జరిగి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రజలకు తెలిపారు. అనవసరమైన నీటి నిల్వలు ఉండకుండా చూడాలని గ్రామస్తులకు సూచించారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా తొలగించారు. అంగన్వాడీలు, మురికి కాల నిర్వహణ, చెత్తనిర్వహణ అనేది సక్రమంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గ్రామపంచాయతీ నిర్వహించే వివిధ రికార్డులను పరిశీలించడంతోపాటు గ్రామ కార్యదర్శి కి పారిశుద్ధ్య నిర్వహణకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.