అనుభవం ఉన్నా కాంట్రాక్టర్లకు టెండర్ దక్కకుండా చేస్తున్నారు
హైదరాబాద్: చిన్న కాంట్రాక్టర్లకు ఎంతో అనుభవం ఉన్నా వారిని టెండర్ దక్కకుండా వేధింపులకు గురిచేస్తున్నారని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఈ విధానంతో పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు. తక్షణమే ఈ విధానం రద్దు చేయాలని తెరాస ఎమ్మెల్యేలు మింట్ కాంపౌండ్‌లోని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ, డైరెక్టర్‌ను కలిశారు. తెలంగాణలో పెద్ద కాంట్రాక్టర్లు అడుగు పెడితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈటెల హెచ్చరించారు.