అన్ని మతాలను గౌరవించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం :మంత్రి శ్రీనివాస్ గౌడ్

 అలంపూర్ జూలై 12(జనంసాక్షి ) దేశంలోనే అన్ని రాష్ట్రాలలోకెల్లా అన్ని మతాలను సమానంగా గౌరవించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం తెలంగాణలో ఏకైక శక్తిపీఠం ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లో గిరి శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు గౌడు, గట్టు తిమ్మప్పలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ చైర్మన్ కృష్ణయ్య ప్రధాన అర్చకులు పూర్ణకుంభం, మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ ఆలయాలలో పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.
అనంతరం ప్రసాద్ స్కీం క్రింద రు. 37 కోట్లతో నిర్మిస్తున్న నిర్మాణం పనులను మంత్రి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. మొదటి అంతస్తు రెండవ అంతస్తులు ఏయే నిర్మాణాలు జరుగుతున్నాయి తెలుసుకున్నారు.ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి తెలుగు రాష్ట్రాల నుండి అలంపూర్ దేవాలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. దేవాలయానికి వచ్చే దారులలో ఆర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. పరిసర ప్రాంతంలో అందమైన మొక్కలు నాటాలన్నారు. ప్రసాద్ స్కీం ద్వారా నిర్మిస్తున్న నిర్మాణాలు త్వరగా పూర్తి అయితే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. వివాహాలు జరుపుకోవడానికి కళ్యాణ మండపం అన్ని ఏర్పాట్లతో నిర్మించాలన్నారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ ఎస్ ఈ ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవాలయ ఆర్చి మెయిన్ రోడ్డు లో ఏర్పాటు చేసి ఆలయ వివరాలు పొందుపరచాలన్నారు. ఒకసారి దర్శిస్తే మళ్ళీ మళ్ళీ సందర్శించాలనే ఆత్రుత పెరగాలన్నారు. పనులకు సంబంధించి ప్రతివారం నివేదిక పంపాలని సంబంధిత కలెక్టర్, పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయాల అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ధూప దీప నైవేద్య పథకం ద్వారా ప్రతి దేవాలయం పూజలు అందుకునెలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , డాక్టర్ అబ్రహం ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి ,రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు గట్టు తిమ్మప్ప , ఆంజనేయులు గౌడ్ , గెల్లు శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ విజయ్, అల్లంపూర్ మున్సిపాల్ చైర్మన్ మనోరమ,నియోజకవర్గం ప్రజాప్రతినిధి, అధికారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు