అభయం అప్లికేషన్‌తో ర్యాగింగ్‌ను అరికడతాం: ఏపీ డీజీపీ
హైదరాబాద్, ఆగస్టు 26: శాంతిభద్రతలను కాపాడడం కోసం ఏపీ పోలీస్ శాఖ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అదే అభయం అప్లికేషన్. అప్లికేషన్స్ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో శాంతిభద్రతల రక్షణలో ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు అభయం అప్లికేషన్ ప్రారంభించినట్లు ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. నేరాలపై అభయం అప్లికేషన్‌కు ఫిర్యాదులను పంపిచవచ్చని డీజీపీ చెప్పారు. ఈ యాప్ సహాయంతో మనం మాట్లాడలేని పరిస్థితుల్లో పానిక్ బటన్ నొక్కితే ఘటనకు సంబంధించి దగ్గరలోని పోలీసులకు సమాచారం అందుతుందని తెలిపారు. అభయం అప్లికేషన్‌తో ర్యాగింగ్‌కు చెక్‌పెడతామని దీమా వ్యక్తం చేశారు. అభయం అప్లికేషన్‌తో విద్యార్థినులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని డీజీపీ రాముడు చెప్పారు. ప్రజలకు ఈ యాప్ గురించి అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ఆపదలో ఉన్న మహిళలకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని డీజీపీ చెప్పారు.