అమరావతికి పెట్టుబడుల వెల్లువ

రానున్న రోజుల్లో పుంజుకోనున్న ఐటిరంగం

అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ను మించి అమరావతిని అభివృద్ది చేసి చూపుతామని ఐటిలో నంబర్‌ వన్‌ చేస్తామని ఐటిశాఖ మంత్రి లోకేశ్‌ తాజాగా చేసిన ప్రకటనతో నిరుద్యోగుల్లో భరోసా నింపేలా ఉంది. లక్ష ఉద్యోగాల కల్పన ధ్యేయమని ప్రకటించారు. ఉద్యోగాల కోసం ఎక్కడో వెతక్కోవాల్సిన పని లేకుండా చేస్తామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కొంత విశ్వాసం నింపేలా ఉన్నాయి. అమరావతిలో అంతర్జాతయ సంస్థలు మెల్లగా క్యూడకడుతున్న తీరు చూస్తుంటే రానున్న కాలంలో అమరావతి నిర్మిణం నాటికి దశ మారనుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన వేసిన సమయంలో ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌లను చూస్తే అదో ప్రపంచం కనిపిస్తుంది. అలాగే రియల్‌ రంగానికి మూడేళ్ళుగా మార్మోగుతున్న పేర్లు విజయవాడ-గుంటూరు. అందుకు కారణం ‘అమరావతి’లో ఏపీ సర్కారు నూతన రాజధాని ప్రకటించమే. అంతే అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకుంటుందని అంచనాలు వెలువడ్డాయి. హైదరాబాద్‌లో వృద్ధికి ఎవరున్నా ఢోకా ఉండదు. హైదరాబాద్‌తో పోటీపడాలంటే విజయవాడలో మౌలిక వసతులు పెరగడంతోపాటు అద్దెలు దిగి రావాల్సిన అవసరముందని సిఎం చంద్రబాబు పదేపదే చెబుతూనే ఉన్నారు. రాజధాని నిర్మాణం పూర్తయి.. మౌలిక వసతులు ఏర్పడిన తర్వాతనే ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకునే వీలుంటుంది. సచివాలయాన్ని అమరావతికి తరలించడంతో వాణిజ్య, నివాస స్థలాలకు బాగా డిమాండ్‌ ఏర్పడి అద్దెలు విపరీతంగా పెరిగాయి. రానున్న కాలంలో దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా అమరావతి ఉండబోతోంది.రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి రేటు ఆ ప్రాంతంలో ఆశించినంతగా ప్రస్తుతానికి లేకున్నా రానున్న కాలంలో రాజధాని ఏర్పడితే ఇప్పుడున్న ధరలు అందుబాటులో లేకుండా పోతాయన్న అంచనాలు ఉన్నాయి. భూములు కొనుగోలు చేసిన వాళ్ళు ఇఫ్పుడు టెన్షన్‌ పడ్డా, వచ్చేది

మంచి కాలమని గుర్తుంచుకోక తప్పదు. హైదరాబాద్‌తో విజయవాడ పోటీపడాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని..అక్కడ చాలా మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉంది.విపరీతమైన అద్దెల మోత విజయవాడలో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి ప్రధాన అవరోధాలుగా మారాయి.ఇదే విషయాన్ని సిఎం చంద్రబాబు కూడా స్వయంగా చెబుతూనే ఉన్నారు. ఇకపోతే అనంతపురం- అమరావతి ఎక్స్‌ ప్రెస్‌ వేపై నిర్మాణం పూర్తి చేసుకుంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌ కానుంది. ఇది రాయలసీమకు గేట్‌వేలా మారుతుందనడంలో సందేహం లేదు. రాయలసీమ వాసులు నూతన రాజధాని ప్రాంతం అయిన విజయవాడకు వెళ్ళాలంటే ఎంతో కష్టం. దీన్ని నివారించేం దుకే ఆరులైన్ల ఎక్స్‌ ప్రెస్‌ను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని చంద్రబాబు ప్రతిపాదించారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపటంతో ఇది కొంత ఆలస్యం అయినా కార్యరూపం దాలుస్తుందని భావించారు.

తాజావార్తలు