అమరావతిలో తుది దశకు ఆకృతులు: బాబు

అమరావతి,అక్టోబర్‌30((జ‌నంసాక్షి): అమరావతిలలో రైతే తొలి పౌరుడని సిఎం చంద్రాబు నాయుడు అన్నారు. /ూజధానిపై వైసీపీ చేసిన కుట్రలను రైతులు తిప్పికొట్టారని చంద్రబాబు కొనియాడారు. రాజధానిని అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. డబ్బులు ఇచ్చి కోర్టుల్లో కేసులు కూడా వేయించారని అన్నారు. రాజధాని రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. పరిపాలన నగరం ఆకృతులు తుదిదశకు వచ్చాయని సీఎం తెలిపారు. రాజధానిలో కార్యాలయాల కోసం 7 టవర్లు నిర్మిస్తామని, రాజధానికి వచ్చేవారితో పోటీపడే స్థాయికి రైతులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఎదగడానికి సంపద అవసరం లేదని, సంకల్పం ఉండాలన్నారు.

వ్యాపారాల్లో ఎదిగేందుకు అన్నివిధాలుగా అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హావిూ ఇచ్చారు. ఏపీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సోమవారం సింగపూర్‌ పర్యటనకు బయలుదేరనున్నారు. మూడు విడతలపాటు వంద మందికి పైగా రైతులను సింగపూర్‌కు సీఆర్‌డీఏ తీసుకువెళ్లనుంది. తొలివిడతగా 34 మంది రైతులు సింగపూర్‌ టూర్‌కు వెళ్లనున్నారు. రైతు బృందం సింగపూర్‌ యాత్రను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రైతులు జీవితాలు బాగుంటాయాని హావిూ ఇచ్చానని, ఆ హావిూని నమ్మి ఎంతోమంది రైతులు రాజధానికి భూములు ఇచ్చారని అన్నారు. రాజధాని నిర్మాణంతో వారంతా రారాజులు కాగలరని అన్నారు.

తాజావార్తలు