అమిత్‌ షాపై దాడి బీజేపీ నేతల పనే

– మాకే దాడి ఆలోచన ఉంటే కాన్వాయ్‌నే అడ్డుకునేవాళ్లం
– ఏపీలో అల్లర్లు సృష్టించేందుకే ఇలాంటి పనులు
– తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌
తిరుపతి, మే14(జ‌నం సాక్షి) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై ఆ పార్టీ నేత కోలా ఆనంద్‌, అతని అనుచరులే దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేందప్రసాద్‌ ఆరోపించారు. అసలు దాడి ఆలోచన ఉంటే అమిత్‌ షా కాన్వాయ్‌నే అడ్డుకునే వాళ్లం అని అన్నారు. సోమవారం రాజేంద్రప్రసాద్‌ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడిన రాజేందప్రసాద్‌.. ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ కార్యకర్తలు శాంతియుతంగానే నిరసన తెలిపారన్నారు. అలిపిరి ఘటనపై రాజకీయం చేయడం తగదన్నారు. బీజేపీ, వైసీపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని, బీజేపీ భారతీయ జగన్‌ పార్టీగా తయారైందని విమర్శించారు. ఓపక్క చంద్రబాబు నాయుడు ప్రత్యేక ¬దా కోసం కేంద్రపై ఉదృతంగా పోరాటం కొనసాగిస్తుంటే.. ప్రత్యేక ¬దా ఇవ్వాల్సిన ప్రధాని మోదీని విమర్శించకుండా చంద్రబాబును విమర్శించడం సిగ్గుచేటన్నారు. జగన్‌కు ప్రజల ఇబ్బందులు పట్టవని, ప్రజలు ఎక్కడ పోయినా నాకు సంబంధం లేదు.. నాకు మాత్రం సీఎం పీఠం కావాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నారని అన్నారు. ప్రత్యేక ¬దాకోసం తమ ఎంపీలతో రాజీనామాలు చేయించామని అంటున్న జగన్‌ వాటిని ఆమోదింప జేసుకోవటంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. జగన్‌ తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరియైన రీతిలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అమిత్‌షాపై దాడి చేసుకొని తెలుగుదేశం వాళ్లే దాటి చేశారని బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, తద్వారా రాజకీయ లబ్ధిపొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు బీజేపీ అంటేనే మండిపడుతున్నారని, బీజేపీ నేతలను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు రెడీగా ఉన్నారని హెచ్చరించారు. ఇప్పటికైన జగన్‌ ప్రత్యేక ¬దా కోసం చంద్రబాబును తిట్టడం మాని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కృషి చేయాలని సూచించారు.

తాజావార్తలు