అమెరికాలో బిజీగా చంద్రబాబు బృందం

పయోనీర్‌ పరిశోధనా కేంద్రం పరిశీలన

అమరావతి,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం బిజీగా ఉంది. అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటోందిన రెండో రోజు పయనీర్‌ పరిశోధన కేంద్రాన్ని సందర్శించింది. పయనీర్‌ ఆవిష్కరణల కేంద్రానికి చేరుకుని కార్యకలాపాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. తమ ప్రాజెక్టులపై సీఎం బృందానికి పయనీర్‌ గ్లోబల్‌ ఉపాధ్యక్షుడు బ్రాడ్‌ లాన్స్‌ వివరించారు. గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్త్రతంగా పని చేసినట్లు పయనీర్‌ శాస్త్రవేత్తలు చెప్పారు. మొక్కల జన్యు అభివృద్ధి, సరఫరాదారుగా పయనీర్‌కు పేరొంది. అనంతరం రాత్రి 10.30గంటలకు అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు విత్తన, వ్యవసాయ సంస్థల సీఎఫ్‌వోలు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. రాత్రి 12.30గంటల నుంచి తెల్లవారుజామున 4.30 వరకు జరగనున్న ద్వైపాక్షిక సమావేశాల్లో బృందం పాల్గొనుంది. ఇంటిదగ్గర తన మనవడితో దీపావళి చేసుకోకుండా… ప్రజల కోసం ఇక్కడికి వచ్చానని… ఇంటిదగ్గర దీపావళి చేసుకోవాల్సిన విూరు తనతో గడపడానికి ఇక్కడకు వచ్చారని డెమోయిన్స్‌ టీడీపీ ఫోరం సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికా పర్యటలో భాగంగా సీఎం బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తాను గతంలో చేసిన చిరు ప్రయత్నం వల్ల విూరంతా ఇక్కడికి వచ్చారన్నారు. ఆనాడు 30 ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్యను 300కు పెంచానని, దాంతో అందరూ ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకున్నారని బాబు పేర్కొన్నారు. విూరు మంచి స్థాయిలో ఉన్నారు… పుట్టిన నేలను, జన్మభూమిని మరవొద్దని అన్నారు. విూ అందర్నీ పైకి తెచ్చిన ఈ నేలను కూడా మరచిపోవద్దని బాబు కోరారు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలతో సంతృప్తి పడకండి… వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగండని సూచించారు. కొంతమంది ఇప్పటికే ఆ స్థాయికి ఎదిగారు.. కానీ ఇది చాలదు, ఇంకా కావాలన్నారు. ప్రపంచంలో ఒక గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని… అదే సమయంలో మన రాష్ట్రం కోసం నెట్‌వర్క్‌ చేయండని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తాజావార్తలు