అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలు వర్తింపజేయాలి

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బందు, గృహలక్ష్మి, మైనార్టీ రుణాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్ చేశారు. సోమవారం కమాన్ పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వయంగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు కమాన్ పూర్ జెడ్ పి టి సి గా కొనసాగుతున్న కమాన్ పూర్ మండలంలో బీసీ బందుకు 525 దరఖాస్తులు వస్తే కేవలం 24 మందికి బీసీ బందు ఇవ్వడం జరిగిందని అన్నారు. గృహలక్ష్మి లో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పేదలకు ఇవ్వాలని అన్నారు. గతంలో మైనార్టీ రుణాల కొరకు 200 మంది దరఖాస్తులు చేసుకుంటే కేవలo ఒకే ఒక్క యూనిట్ మంజూర అయిందని అన్నారు. బీసీ కార్డును ఉపయోగించి బీసీ పేరుతో పబ్బం గడుపుతున్న జడ్పీ చైర్మన్ తన సొంత బి.ఆర్.ఎస్ నాయకుడు అనవేన వేణు పై దాడి జరిగిన దాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సింది పోయి పట్టించుకోకపోవడంతో వేణు మనస్థాపానికి అన్నారు. కమాన్పూర్ జెడ్పిటిసి గా గెలిచిన పుట్ట మధు కమాన్ పూర్ మండలాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం కమాన్ పూర్ నుండి ఎఫ్ సి ఐ వరకు రోడ్డు పూర్తిగా చెడిపోయిన జడ్పి చైర్మన్ ఏమాత్రం పట్టించుకోలేదు అని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షీలారపు మల్లయ్య, జూలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు భూస తిరుపతి, పెంచికలపేట గ్రామ శాఖ అధ్యక్షుడు ఇరుగురాల శేఖర్, గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు అంజి, సోషల్ మీడియా ఇంచార్జ్ పెండ్యాల రాజు, జూలపల్లి గ్రామ నాయకులు బొజ్జ సతీష్, మామిడి రాజు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు