అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తాం -ఎమ్మెల్యే రెడ్యానాయక్
డోర్నకల్ సెప్టెంబర్ -1 (జనం సాక్షి న్యూస్)
అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాం అని ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో అర్హులైన 1274 మందికి,గొల్లచర్ల గ్రామంలో పలు గ్రామాలకు సంబంధించి 572 మందికి నూతన ఆసరా పింఛన్ల కార్డులను పంపిణీ చేసిన డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయిక్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు,ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్‌లు అందజేస్తున్నారన్నారు.పింఛన్ రానివారు అధైర్యపడవద్దని అర్హులైన వారందరికిపెన్షన్స్ వస్తాయన్నారు. దరఖాస్తు చేసుకొని వారు ఉంటే చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. డోర్నకల్ పట్టణంలో సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ . గొల్లచర్ల గ్రామం సాయి రెడ్డి ఫంక్షన్ హాల్ లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రెడ్యా చిత్రపటారులకు పాలాభిషేకం చేసిన ప్రజాప్రతినిధులు. ప్రజా సంక్షేమ ప్రభుత్వ దేహమని, రాబోయే ఎన్నికల్లో మరో మారు టిఆర్ఎస్ ప్రభుత్వానికి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రెడ్యా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నున్న రమణ, ఎంపీపీ బాలు నాయక్, జడ్పిటిసి కమల రామనాథం, మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం,సొసైటీ చైర్మన్ బిక్షం రెడ్డి, ఎంపీడీఓ అపర్ణ,ఎంపీఓ మున్వర్ బేగ్, కమిషనర్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ , వార్డ్ కౌన్సిలర్లు,కోఆప్షన్ మెంబర్లు, వివిధ గ్రామాల సర్పంచులు సిహెచ్ సమ్మిరెడ్డి, బాదావత్ బాలాజీ, లేనిల్ కుమార్,దేవి శంకర్ నాయక్, బానోతు రాంబాయి మంగీలాల్,డిఎస్ రాంబాయి శంకర్, వెంకట బాబు,అంగోత్ సరోజ,శ్రీను,మూడ్ జాంరి బాలాజీ, సునీత వీరన్న, ఎంపీటీసీలు భూక్య శ్రీనివాస్ నాయక్, శంకర్ కోటి,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రామనాథం,గొర్ల సత్తిరెడ్డి, మేకపోతులు శ్రీనివాస్,డైరెక్టర్ సపవట్ హుసేన్, మహిళా అధ్యక్షురాలు హైమావతి,పింఛన్ లబ్ధిదారులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.