అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే పాదయాత్ర
నంద్యాల,నవంబర్7(జనంసాక్షి): అవినీతిలో నిండా మునిగిన విపక్షనేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎలా విమర్శలు చేస్తారని టీడీపీ నేత,ఎమ్మెల్యే ఎన్‌ఎండి ఫరూక్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రత్యేక ¬దాపై మాట్లాడుతున్న జగన్ ప్రత్యేక ¬దా ఇవ్వాల్సింది చంద్రబాబు కాదన్న విషయం జగన్‌కు తెలియదా? అని అన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ ఆర్థిక నేరం జరిగినా అందులో జగన్ పాత్ర ఉండడం సర్వసాధారణమైందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టింది. అభ్యంతరకర వ్యాఖ్యలపై కేసు నమోదైనా జగన్ తీరు మారలేదు. సీఎం చంద్రబాబును వాడు, వీడు అంటూ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే జైలుకి వెళ్తానేమోనన్న భయంతో జగన్ పాదయాత్ర నాటకానికి తెరతీశారని దుయ్యబట్టారు. పాదయాత్ర పేరుతో అరాచకాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే వైసీపీ, జగన్ పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. జగన్ పాదయాత్ర ఓ జగన్నాటకమని విమర్శించారు. జగన్ పాదయాత్ర వల్ల తమ పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని అన్నారు. ఈ మూడేళ్లలో ఎన్నో హావిూలు నెరవేర్చామని, అందుకే ప్రజలు తమ పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు. జగన్ పాదయాత్ర ముగిసేనాటికి.. వైసీపీలో ఆయనతోపాటు మరో ఐదుగురు మాత్రమే ఉంటారని అన్నారు. పాదయాత్రతో ప్రజలను మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. పరిణతిలేని నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టమని అన్నారు.