అశోక్‌బాబుపై లేనిపోని విమర్శలు ఎందుకు?
ఏలూరు,మే10(జనం సాక్షి): ఏపీఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబుపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఇది సరైన విధానం కాదని ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎస్ హరనాధ్ అన్నారు. సమాజంలో ఉద్యోగులు కూడా భాగస్వాములేనని అన్నారు. ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేసుకునే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా కల్పించాలని కర్ణాటకలోని ఉద్యోగులను కూడా కోరాలని కోరేందుకు అశోక్‌బాబు కర్ణాటక వెళితే అక్కడ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అశోక్‌బాబు ప్రచారం చేశారంటూ కొందరు దుష్పచ్రారం చేస్తుండటం బాధాకరమన్నారు. అశోక్‌బాబును తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌గా విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారని అదేగనక నిజమైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అశోక్‌బాబు ఎందుకు ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో రూపొందించిన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం విధిగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించ వద్దంటూ తొలుత పోరాడింది ఏపీఎన్‌జీవో సంఘమేనని ఈ సందర్భంగా హరనాధ్ వ్యాఖ్యానించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఎన్‌జీవోల సంఘం నాయకులపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ఏపీకి ప్రత్యేక ¬దాను సాధించడం కోసం ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక ¬దా ఉద్యమం ఉమ్మడిగా సాగిన నాడే లక్ష్యసాధనకు అవకాశం కలుగుతుందని చెప్పారు. జరిగిన అన్యాయంపై అన్ని రాష్ట్రాల ప్రజలు స్పందించకపోతే ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దాను సాధించడం కోసం తమ సంఘం నిరంతరం పోరాటం సాగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. తమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబుపై బురద జల్లే ప్రయత్నాన్ని బీజేపీ నాయకులు మానుకోవాలని సూచించారు.
—–