అసలు సమస్యల్లా ఉద్యోగలు వసతి

తాత్కాలిక హాస్టళ్లు కావాలంటున్న నేతలు?
విజయవాడ,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): ఓ వైపు తాత్కాలిక రాజధాని వద్ద సచివాలయ నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. జూన్‌ నాటికి ఇక్కడి నుంచే కార్యకలాపాలు చేపట్టాలన్న ధృడ సంకల్పంలో సిఎంవ చంద్రబాబు ఉన్నారు. దీనికితోడు మంత్రలు, అధికారులు అంతా ఇక్కడి నుంచే పాలన నిర్వహించేలా చూస్తున్నారు. ఉద్యోగులు కూడా రావాల్సిందే అని అల్టిమేటమ్‌ ఇచ్చారు. పదేల్ల వెసలుబాటు హైదరాబాద్‌లో ఉన్నా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక వద్దని అనుకుంటున్నారు. దీంతో బాబు విజయవాడలోనే మకాం వేసి పాలన సాగిస్తున్నారు. కొంతలో కొంత మేలు అన్నట్లుగా హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వారికి వారంలో ఐదురోజులు పనిదినాలుగా నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ విూడియాకు వెల్లడించారు. అమరావతికి తరలివచ్చే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనివిధాలా చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే అమరావతికొచ్చే ఉద్యోగులకు వారంలో ఐదు రోజులపాటు పనిదినాలుగా ఏడాదిపాటు వెసులుబాటును సీఎం చంద్రబాబు కల్పించారని ఆయన చెప్పారు. రాజధానికొచ్చే ఉద్యోగులకు కార్యాలయాన్ని సమకూరుస్తున్నామని, ఇళ్లు మాత్రం వారే చూసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ నాటికి 4,500 మంది, జూలై నెలాఖరుకు 3 వేలమంది, ఆగస్టులో మిగిలిన ఉద్యోగులు అమరావతికి తరలివస్తారని చెప్పారు. ఉద్యోగుల పిల్లల స్థానికత విషయంలో కేందప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కేంద్రానికి సీఎం లేఖ రాస్తామని మంత్రి వెల్లడించారు. వారానికి ఐదు రోజుల పని దినాల విధానాన్ని అమలు చేయడం ద్వారా హైదారబాద్‌ నుంచి వారానికి ఓ మారు వచ్చిపోయే వెసలుబాటు ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు కూడా భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఫ్యామిలీ, పిల్లలను షిఫ్ట్‌ చేయకుండా అమరావతిలో ఐదురోజుల కోసం హాస్టళ్ల లాంటి వసతి చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వమే ఈ వసతి కల్పిస్తే మంచిదన్న భావన వీరిలో ఉంది.  దీంతో ఉద్యోగులకు వారంలో రెండు రోజుల సెలవు లభించనుంది. ఉద్యోగ నేతలు కొన్నాళ్లుగా ఐదు రోజుల పది దినాలకోసం విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విధానం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఇక తాత్కాలిక హాస్టల్‌ తరహా వసతి కూడా అంగీకరిస్తే తమకు రావడానికి ఇబ్బంది ఉండదని అంటున్నారు.  జూన్‌నాటికి తాత్కాలిక సచివాలయంలోని జీ ప్లస్‌ వన్‌ నిర్మాణం పూర్తవుతుంది. జూన్‌నాటికి హైదరాబాద్‌లోని సచివాలయ ఉద్యోగులరాకతో నవ్యాంధ్రలో నూటికి నూరుపాళ్లు పరిపాలన మొదలవుతుంది. ఆగస్టులో సీఎం కార్యాలయం సిద్ధమయిపోతుంది అని భావిస్తున్నారు. ఉద్యోగుల నివాసాల విషయమై ప్రభుత్వం ముందే చెప్పిందని, ఎవరికి వారే వసతి చూసుకోవలసి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి తరలించాల్సిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 12 వేల మంది. ఇంతమందికీ ఒకే క్యాంప్‌సలో పని వసతి కల్పించాలంటే జి ప్లస్‌ 4 అవసరమని భావిస్తున్నట్టు తెలిసింది. వసతి ఇబ్బందిగా ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల్లో వెతుక్కోక తప్పదని సూచిస్తున్నారు.

తాజావార్తలు