ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కుదరదు
కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయమై ఎలాంటి చట్టబద్ధత కల్పించ లేదన్నారు. అందువల్ల హోదా అంటూ రాబోదని, దానికి మించిన రీతిలో ప్యాకేజీలతో ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. ప్రధానిగా మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిమండలి 2014 మే 26న కొలువుదీరిందని గుర్తు చేశారు. ఆ మర్నాడు నిర్వహించిన తొలి కేబినెట్ భేటీ అజెండాలోనే ఆంధ్రప్రదేశ్‌కు జీవన రేఖగా భావిస్తూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తెలంగాణాలోని ఏడు మండలాలపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు నిశ్చయించినట్లు తెలిపారు. అలా కేంద్రంలో మోదీ గద్దెనెక్కిన మర్నాడే ఆంధ్రప్రదేశ్‌లో ఏడు తెలంగాణా మండలాలను కలిపే నిర్ణయంతో రాష్ట్భ్రావృద్ధికి కట్టుబడినట్లు కేంద్రం తన నిబద్ధతను రుజువు చేసుకుందన్నారు.