ఆకర్శణీయంగా నిట్‌ లోగో ఖరారు

శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు
ఏలూరు,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): నిట్‌కి సంబంధించిన లోగోను ఖరారు చేశారు. ఎంఎల్‌ఎ సూచనల మేరకు ఈ లోగోను రాష్ట్ర విశిష్టత స్థానిక ప్రాధాన్యలు, పాడిపంటలు, సాంకేతిక అంశాలను ప్రతిబింబించే విధంగా అత్యంత అర్థవంతంగా రూపకల్పన చేశారు. లోగోను పరిశీలించిన మాజ.మంత్రి మాణిక్యాలరావు సంతృప్తి వ్యక్తం చేశారు. రూపకర్తలను అభినందించారు. ప్రధానంగా కలశం, వరికంకులు, ఇంజినీరింగ్‌ వీల్స్‌ తదితర అంశాలను లోగోలో చేర్చారు. ఇకపోతే తాడేపల్లి గూడెం నిట్‌కు శాశ్వత భవనాల నిర్మాణంలోలంఓ జాప్యం లేకుండా కేంద్రంతో చర్చించి తోడ్పాటును అందిస్తానని బిజెపి నాయకుడు, మాజీమంత్రి పి. మాణిక్యా లరావు వెల్లడించారు. నిట్‌ తొలి దశ శాశ్వత భవనాల పనులు జాప్యం కావడానికి వీల్లేదన్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సిపిడబ్ల్యూడి ఉన్నతాధికారులతో సమావేశమై నిర్మాణ పనులపై చర్చించినట్లు తెలిపారు.
త్వరలోనే రోజుల్లో ఢిల్లీ వెళ్లి మానవ వనరుల మంత్రి జవదేవకర్‌, సిపిడబ్ల్యూడి డైరెక్టర్‌ జనరల్‌, ఇతర అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. నిట్‌ శాశ్వత భవనాల తొలి దశ పనులు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు ప్రస్తుత పరిస్థితిపై నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సూర్యప్రకాశరావు వివరించారు. శాశ్వత భవనాల తొలిదశ పనులు సత్వరం చేపట్టేందుకు అవసరమైన చర్యలపై చర్చించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ కేంద్ర ప్రజా పనుల శాఖ, ఉన్నతాధికారులతో త్వరలో ఢిల్లీలో సమావేశం కానున్నట్లు మాణిక్యాలరావు వెల్లడించారు.

తాజావార్తలు