ఆక్రమణ”లకు పాల్పడుతూ అసత్య ఆరోపణలు చేస్తారా..

 

బిజెపి పట్టణ అధ్యక్షుడి వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకుల ఆగ్రహం.

అవినీతిపై రుజువులు ఉంటే చూపాలే.. అసత్య ఆరోపణలు చేసే సహించ బోము.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 15.,(జనంసాక్షి). భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షులు సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు దార్ల సందీప్, కత్తెర వరుణ్ మాట్లాడుతూ దేశంలోని అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న సిరిసిల్ల మున్సిపాలిటీకి అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల మునిసిపల్ పాలకవర్గం అధికారుల సమిష్టి కృషితో ప్రజలకు సేవలు అందిస్తుందని తెలిపారు. ఢిల్లీ నాయకులు ప్రశంసిస్తుంటే సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మున్సిపల్ పాలకవర్గం మంత్రి కేటీఆర్ ను విమర్శించడంపై మండిపడ్డారు. కేటీఆర్ ను విమర్శించే స్థాయి బిజెపి పట్టణ అధ్యక్షుడికి లేదని అన్నారు. బిజెపి పట్టణ అధ్యక్షుడు ఆక్రమణలకు పాల్పడ్డట్టు రుజువులు ఉన్నాయని శివాలయ స్థలంతో పాటు రోడ్డును ఆక్రమించి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. సమాచార హక్కు పేరుతో సిరిసిల్ల పట్టణంలో కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లపై ఫిర్యాదు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు రుజువులు ఉన్నాయని అన్నారు. ఈ విషయం పోలీసు కేసుల దాకా పోయిందని విమర్శించారు. దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతూ తప్పుడు ధోరణితో వ్యవహరిస్తున్న పట్టణ అధ్యక్షుడిపై బిజెపి అధిష్టానం స్పందించకపోతే ఆ పార్టీకే నష్టమని అన్నారు. మరోసారి నిరోధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్, ఆకుల చిన్న, రాపేల్లి దినేష్ నాయకులు వెంగళ శ్రీనివాస్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు