ఆడబిడ్డల జోలికొస్తే అంతే సంగతులు

టెలి కాన్ఫరెన్స్‌లో బాబు హెచ్చరిక
అమరావతి,మే7(జ‌నం సాక్షి): లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫోక్సో చట్ట సవరణపై అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆడబిడ్డల జోలికి వెళ్తే ఉరిశిక్ష వేస్తారనే భయం రావాలని, ‘ఆడబిడ్డలకు రక్షణగా…కదులుదాం’ ర్యాలీలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  నీరు-ప్రగతి, వ్యవసాయంపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షపాతం లోటు 11శాతం  ఉన్నా భూగర్భ జలమట్టం 2.4విూ. పెరిగింది. జలసంరక్షణ చర్యలు మరింత ముమ్మరంగా నిర్వహించాలి. పంటకుంటలు, కాంటూరు ట్రెంచింగ్‌ పనులు వేగవంతం చేయాలి. ఏప్రిల్‌లో రూ.750 కోట్ల నరేగా పనులు…మే నెలలో రూ.1,000 కోట్ల పనులు జరగాలి. ప్రతినెలా ఇదే వేగంతో చేస్తే రూ.10వేల కోట్ల వినియోగం సాధ్యమే. అకాల వర్షాలకు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. పంటనష్టం అంచనాలు నాలుగు రోజుల్లో పూర్తిచేయాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి…ఇన్‌ పుట్‌ సబ్సిడీ పంపిణీ చేయాలి. ఏడాదికి 10లక్షల ఎకరాల్లో పండ్లతోటల సాగు పెరగాలి.
ఉద్యాన పంటల విస్తీర్ణం కోటి ఎకరాలకు విస్తరించాలి. పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి… ప్రాణనష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.
———

తాజావార్తలు