ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా బాలలకు మంచి భవిష్యత్తు జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) వి.రాహుల్‌

మంచిర్యాల ప్రతినిధి, జులై 12, (జనంసాక్షి): జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం ద్వారా బాలలకు మంచి భవిష్యత్తు అందించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి కె. చిన్నయ్యతో కలిసి ఆపరేషన్‌ ముస్కాన్‌-9 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం ద్వారా బడికి దూరమైన పిల్లలు, బడి మానివేసిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించి విద్యాశాఖ ద్వారా వారిని పాఠశాలల్లో చేర్చించడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై దృష్టి సారించడం జరుగుతుందని, బాలకార్మికులను గుర్తించి పునరావాసం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం జూలై 1 నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 3 డివిజన్లలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత అధికారులు కార్యక్రమాన్ని పకడ్బృంధీగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు, ఆపరేషన్‌ ముస్కాన్‌ టీం సభ్యులకు కార్యక్రమ నిర్వహణపై సూచనలు, సలహాలు చేశారు. అనంతరం కార్యక్రమ సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు ఎల్‌. సుందర్‌, అనిల్‌కుమార్‌, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎన్‌. ఆనంద్‌, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులముల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పి. రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి ఎస్‌.యాదయ్య, డి. ఈ. ఎం. ఓ. బి.వెంకటేశ్వర్‌, కార్మికశాఖ, పోలీసు శాఖఅధికారులు,      రెస్య్యూ టీమ్‌ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు