*ఆయిల్ ఫామ్ పంటలో అంతర్ గా మిరప పంట లాభసాటి*: ఎ ఓ చంద్రమౌళి.
పెబ్బేరు సెప్టెంబర్ 27 (జనంసాక్షి ):
పెబ్బేరు మండలంలోని పెంచికలపాడు మరియు ఈర్లదిన్నె గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారి చంద్రమౌళి పంటలను పరిశీలించారు. పెంచికలపాడు గ్రామంలో రైతు యొక్క పొలంలో ఆయిల్ ఫామ్ సాగులో అంతర పంటగా మిరప పంటను వ్యవసాయ అధికారులు సూచన మేరకు రైతు నాగేంద్రం సాగు చేయించడం సాగుచేసారని ఇందులో భాగంగా పామాయిల్ లో అంతర పంటను మిరప వేసుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు అని రైతులకు వ్యవసాయ అధికారి చంద్రమౌళి వివరించారు. ఈ సంవత్సరం ఆయిల్ ఫాo అంతర పంటలు గా ఎప్పుడు వేసేటువంటి మినుము పెసరలో బదులుగా మిరప వేస్తే లాభసాటిగా ఉంటుందని. క్రమంలో మిరప పంటలు తెగుళ్లు మరియు పురుగులను గుర్తించి రైతులకు సలహా సూచనలు కూడా ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా మిరప పంటలు పై మడుతమరియు వేరు కుళ్ళు తెగులును వచ్చాయని రైతులకు చెప్పడం జరిగింది దీని నివారణకుస్పైనోసాడ్ 45% ఎస్ సి 100 ఎమ్ ఎల్, లేదా
డై ఫెన్త్యురాన్ 50% డబ్ల్యూ ఈ 250 గ్రా, లేదా
క్లోరోఫెనపైర్ 10%ఎస్ సి -400 ఎమ్ ఎల్, ఫిప్రోనిల్ + ఇమిడాక్లోప్రిడ్ _200 గ్రాములు ఎకరాకు 200 లీటర్ల కలిపి పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వేరు కుళ్ళు తెగులు నివారణకు మొక్కల యొక్క మొదల వద్ద కాపర్ ఆక్సీక్లోరైడ్ 50%డబ్ల్యూ పి -500 ఎకరాకు 200 లీటర్ల నీళ్లు కలుపుకొని మొక్కల వద్ద పోయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ నరేష్, గ్రామ రైతు నాగేంద్రం నాగరాజు శోభ వెంకటేష్ పసుల బాబు లక్ష్మీనారాయణ గ్రామ రైతులు పాల్గొన్నారు.
Attachments area