ఆర్థికవృద్ది రేటు 6.7శాతం

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆర్థిక వృద్దిరేటు ఆశాజనకంగా ఉంటుందని ప్రధాని ఆర్థిక మండలి తెలిపింది. సి.రంగరాజన్‌ అధ్యక్షతన ఏర్పడిన ఆర్థిక సలహామండలి ఈరోజు మీడియాకు తమ అధ్యయన వివరాలు తెలియజేసింది. ఆర్థిక వృద్దిరేటు 6.7శాతంగా ఉంటుందని వారు తెలిపారు. 2012-13ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.5-7 మధ్య ఉండవచ్చని వారు తెలియజేశారు. వర్షాభావ పరిస్థితుల దృష్యా వ్యవసాయ వృద్దిరేటు మాత్రం 0.5 శాతం తగ్గవచ్చన్నారు. డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని, ఎల్పీజీ సిలిండర్ల వాడకంపై పరిమితి విధించే అవకాశం ఉందని పేర్కోన్నారు.

తాజావార్తలు