ఆలయాల్లో శ్రావణమాస పూజలు
తాడిపత్రి: స్థానిక శ్రీ చింతలవెంకటరమణస్వామి దేవాలయంలో శ్రావణ మాసం మొదటి శనివారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేకాలు, అర్చనలు, స్వామివారిని ప్రత్యేకంగా అలంకారం చేశారు. భక్తులు పెద్దఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఏటిగడ్డపాలెంలో : స్థానిక ఏటిగడ్డపాలెం లోని శ్రీ ఆంజనేయస్వామి, పుట్లూరురోడ్డు, గణేష్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయాల్లోను, సుంకులమ్మ పాలెం, నంద్యాలరోడ్డులోని శ్రీ రామాలయాల్లో శనివారం శ్రావణమాసం ప్రత్యే క పూజలు జరిగాయి.
తాడిపత్రిరూరల్‌లో: మండలపరిధిలోని ఆలూరు కోన రంగనాథస్వామి, హుస్సేనాపురం సమీపంలో ఉన్న ఉమామహేశ్వరస్వామి ఆల యంలో, ఓబులేసు కోన జంబులపాడు శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయాల్లో శ్రావణ మాసం పురస్కరించుకొని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకం, ఆకుపూజలు, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు.
పెద్దపప్పూరులో : మండలంలోని చిన్నపప్పూరు గ్రామ సమీపంలో వెలసిన శ్రీ అశ్వత్థ నారాయణస్వామి ఆలయంలో శనివారం శ్రావణ మాస పూజలు ఘనంగా జరిగాయి. పూజల్లో భాగంగా అశ్వత్థ నారాయణస్వామికి, శివునికి అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ చైర్మన్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
యల్లనూరులో : మండలంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రావణమాస పూజలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. యల్లనూరు, చిలమకూరు గ్రామాల్లోని ఆంజనేయస్వా మి దేవాలయాల్లో భక్తులు ఉదయం నుంచి ఆ కుపూజ, అభిషేకాలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పత్తికొండ, కర్నూలుప్రాంతాలకు చెందిన భక్తులు హాజరయ్యారు.
పుట్లూరులో : మండలంలోని రంగమనాయునిపల్లి, ఏ కొండాపురం శివార్లలో వెలసిన ఆంజనేయస్వామికి శనివారం శ్రావణమాస పూజలు నిర్వహించారు. స్వామివారికి జలాభిషేకం, అర్చనలు, మంగళహారతి ఇచ్చి పూజలు చేశారు. అనంతరం మహిళలు ప్రత్యేకంగా స్వామివారి ఆలయం చుట్టూ తిరుగుతూ మొక్కులు తీర్చుకున్నా