ఆషాడం అమావాస్య సందర్భంగా మహబూబ్ నగర్ నుండి గానుగాపూర్ కు ప్రత్యేక బస్సులు
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 14 (జనం సాక్షి)
ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 17వ తేదీ ఆషాడం అమావాస్య సందర్భంగా మహబూబ్ నగర్ టీఎస్ ఆర్టీసీ డిపో అధికారులు గానుగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రమునకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు . ఇట్టి బస్సులు 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు మహబూబ్ నగర్ బస్టాండ్ నుండి
బయలుదేరి రాత్రికి గానుగాపూర్ చేరుకుంటుందనీ రాత్రికి అక్కడే ఉండి , తెల్లవారితే 17వ తేదీ అమావాస్య సందర్భంగా ఉదయాన్నే సంగమేశ్వర సంగమ నదిలో స్నానమాచరించి క్షేత్ర దర్శనమునకు బయలుదేరాలి . క్షేత్ర దర్శనంలో దత్తాత్రేయ స్వామి వారికి పెద్ద హారతి ఉదయం11:30 గంటలకు ఉంటుంది . హారతి కార్యక్రమంలో అందరూ పాల్గొని హారతిని దర్శించుకుని గుడి దగ్గరే కొందరు వారికి తోచిన తీర్థ ప్రసాదములు ఇస్తారు . వాటిని మనం ఒక ఐదు ఇళ్ల ప్రసాదాన్ని భిక్షాటనగా తీసుకొని అట్టి ప్రసాదాన్ని మనం భుజించాలి . తర్వాత మధ్యాహ్నం గానగాపూర్ నుండి బయలుదేరి గుల్బర్గాలోని అతిపురాతనమైన శరణభసవేశ్వర ఆలయ దర్శనం చేసుకొని , అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మణికేశ్వరి మాత పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని సాయంత్రం వరకు మహబూబ్ నగర్ కు చేరుకుంటామనీ డి ఎం తెలిపారు . ఇట్టి స్పెషల్ యాత్రకు చార్జీ 800/- రూపాయలు ఉంటుందని , కాబట్టి ఆషాడ అమావాస్య సందర్భంగా గానుగాపూర్ దర్శనార్థము వెళ్లే భక్తులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగ పరచుకోగలరని ఆయన కోరారు . మరింత సమాచారం కోసం ఈ క్రింద తెలుపబడిన ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు .
7382827102 – 9441162588