ఆస్ట్రేలియా బొగ్గు గనుల వ్వవహారంపై అనుమతులు మంజూరు

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా బొగ్గు గనుల వ్వవహారంపై అక్కడి ఫెడరల్‌ ప్రభుత్వం ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ జీవీకేకు పర్వావరణ అనుమతుల్ని మంజూరు చేసింది. ఈ సంస్థ ఆస్ట్రెలియాలోని హాన్‌కాక్‌ ప్రాస్పెక్టింగ్‌ సంస్థ నుంచి ఆల్ఫాకోల్‌, ఆల్పా వెస్ట్‌ బొగ్గు గనుల్లో 79 శాతం వాటాని, కెవిన్స్‌ కార్నర్‌ ప్రాజెక్టులో వందశాతం వాటాని కొనుగోలు చేసింది. ఆల్ఫా బొగ్గు గనులు కలిగిన క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినప్పటికీ ఈ వివాదం ఫెడరల్‌ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. మరో వైపు ఆల్ఫా బొగ్గుగని నుంచి స్థానిక పర్టు వరకు రైలు మార్గానికీ అనుమతులు మంజూరయ్యాయి. జీవీకే దక్కించుకున్న ఈ బొగ్గుగనుల సామర్థ్యం ఏటా 80. మిలియన్‌ టన్నులు కావడం విశేషం.

తాజావార్తలు