ఇంకుడు గుంతలు తప్పనిసరి 

అనంతపురం,మే11(జ‌నం సాక్షి ): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నీటి వనరులను కాపాడుకోవడంతో పాటు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌  అన్నారు. వర్షపు 
నీరు భూమిలోకి నేరుగా ఇంకేలా ప్రతీ ఒక్కరూ తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని సూచించారు.  ప్రతీ నీటి బొట్టును కాపాడి భవిష్యత్తు తరాలకు మార్గం చూపాలని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో  చేపట్టిన ఇంకుడు గుంతల తవ్వకం కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు తవ్వారు. ఇదిలావుంటే భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ పెద్దఎత్తున ఇంకుడు గుంతలు తవ్వాలని సూచించారు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్‌ తెదేపాని స్థాపించి, పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి వంటివి అమలుచేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.

తాజావార్తలు