ఇంజక్షన్‌లో ఏముంది.

 

సూది మందు పేరు వినగానే ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏ మండలంలో ఏ ఊళ్ళో సూదిగాడు దాడి చేస్తాడో తెలియని స్థితి నెలకొంది. ఈ సూదిగాడు వేస్తున్న ఇంజక్షన్‌లో ఏముంది..? ఆ సూది మందు వలన నష్టం ఏంటి? హానికరమై ఎయిడ్స్ కారకాలు ఉన్నాయా? లేదా స్లో పాయిజన్ ఉందా? లేదా మరేదైనా వ్యాధికారకాలున్నాయా..? ఇలాంటి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతుంది. లేదా కేవలం ప్రభుత్వాన్ని, పోలీసులను మానసికంగా దెబ్బతీయడానికి ఓ సైకో చేస్తున్న చర్యలా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల మండలాలలో గత నెల 21 తేదిన ఓ వ్యక్తి విద్యార్థినిపై సూది మందు పొడిచి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి 20 మందిపై ఈ సూదిగాడి దాడి జరిగింది. ఇదే ఇటు పోలీసులను, అటు జనాన్ని వణికిచ్చేస్తోంది. విద్యార్థినీలు, మహిళలే టార్గెట్‌గా సైకో పని చేస్తున్నాడు. అతనికి తోడు మరో యువతి కలిసిందనే అంశం, అలాగే పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరికి కూడా వీరి చేష్టలు ప్రాకాయని విషయం జనాన్ని భయపెడుతోంది. 
సైకో విషయంలో చంద్రబాబు అధికారులపై సీరియస్ అయ్యారు. అతని పట్టుకోవడానికి దాదాపు 11 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే 300 మంది పోలీసులను నియమించారు. లక్ష రూపాయలు రివార్డు ప్రకటించారు. రెండు ఊహా చిత్రాలను విడుదల చేశారు. అయినా సైకో జాడ కనుక్కోలేకపోతున్నారు. ఇది ఒక ఎత్తయితే… అతను ఇస్తున్న సూదమందు ఏమిటి? అనేది పెద్ద సవాల్‌గా మారుతోంది.
దానిపై ఇప్పటి వరకూ వైద్యులు ఎటువంటి ప్రకటనా చేయలేదు. సూదిగాడి మందుకు దెబ్బతిన్న మహిళలకు వైద్య సేవలు అందిస్తున్నారే తప్ప, అందులో ఏముందనే విషయం బయట పెట్టలేదు. ఎయిడ్స్ కారకాలను సూది మందు ద్వారా ఏమైనా ఉన్నాయా అనే అనుమానం కూడా కలుగుతోంది. సూదులను పరిశీలించిన అధికారులు మాత్రం ఏమి ప్రకటించలేదు. అసలు ఆ సూదిలో స్లో పాయిజన్ వంటి కారకాలేమైనా ఉన్నాయా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఒకవైపు సూదిగాణ్ణి పట్టుకోలేకపోవడం మరోవైపు సూదిగాడి మందులో ఏముందో తెలపకపోవడం మరింత ఆందోళన కనిపిస్తోంది. 

తాజావార్తలు