ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలో ర్యాంకు వస్తే పూర్తి ఫీజు చెల్లిస్తాం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలో పదివేల లోపు ర్యాంకు వచ్చినవారు ఎవరైనా ఫీజును పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమర్‌రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 687 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింది సీటు పొంది ఎస్సీ,ఎస్టీ బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టంచేశారు. బోధనా ఫీజును రూ. 35 వేలుకు పెంచినట్టు ఆయన తెలిపారు. మేనేజ్‌మెంట్‌ కోటాలోని సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టి పారదర్శకంగా సీట్లు నింపాలని అదేశించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్నీ కళాశాలలు నిబంధనలు పాటించాల్సిందేనని ముఖ్యమంత్రి అన్నారు. కళాశాలలు ఇస్తున్న సమాచారం సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకునేందుకే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. టాస్స్‌ఫోర్స్‌ నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్టు సీఎం పేర్కొన్నారు.

తాజావార్తలు