ఇంటర్ అడ్మీషన్ల గడువు పెంపు: డీఐఈఓ

ఆగస్టు 5 లోపు అడ్మీషన్లు చేపట్టాలని ఆదేశం

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చేరటానికి అడ్మిషన్ల గడువును ఆగస్టు 5 వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులు మొదటి సంవత్సరం అడ్మిషన్ చేరటానికి జూలై 31 వరకు మాత్రమే గడువు ఉందని వరుసగా కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యార్థుల సౌలభ్యం కొరకు ఈ గడువును ఆగస్టు 5 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. రెగ్యులర్ ఇంటర్ అడ్మీషన్లకు టీ.సీ తప్పనిసరని స్పష్టం చేసారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ గారి ఆదేశానుసారం ప్రైవేటు జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందగోరే విద్యార్థులు గడువు తేదీ ముగిసిన తర్వాత ఆగస్టు 6 నుండి 16 వ తేదీల్లో రు.500/- లేట్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుందని, కావున ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ గడువు తేదీ ఆగస్టు 5 లోగా పూర్తి చేసుకోవాల్సిందిగా సూచించారు.

తాజావార్తలు