ఇంటింటికి సంస్కృతం

గుంటూరు (సాంస్కృతికం): ఇంటింటికి వెళ్లి జనుల్ని కలవడం ద్వారా ఆత్మీయమైన సంస్కృత ప్రచార ప్రభావం అవుతుందని సంస్కృత భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ డీఎన్‌ దీక్షిత్‌ అన్నారు. ఆదివారం హిందూ కళాశాల ప్రాంగణంలో యువజన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గృహం గృహం సంస్కృతం అనే కార్యక్రమాన్ని సంస్కృత భారతి సంస్థ దేశమంతట జరుపుతోందని ఆయన అన్నారు. 23వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగే ఈ కార్యక్రమంలో సంస్కృత భాషాభిమానులు, విద్యార్థులు ఎవరైన పాల్గొనవచ్చన్నారు. ఒక సంస్కృత పుస్తకమైనా ప్రతి ఇంటికి చేరాలనే ఉద్ధేశంతో అందరు కలిసి సంస్కృతం కోసం ఒక రోజు పని చేయాలన్నారు. దీనికోసం సంస్కృత పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించి అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంస్కృత పుస్తకాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు ఎం భాస్కర్‌ రెడ్డి, జిల్లా సంయోజకులు పల్లా రాధాకృష్ణమూర్తి, శాఖమూరి శివరాంబాబు, డాక్టర్‌ ఎన్‌ రాంబాబు ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని పత్రి వేణుగోపాల్‌, పీ దేవేంద్ర గుప్తా పర్యవేక్షించారు.

తాజావార్తలు