ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని సందర్శించిన ఎంపీపీ
చొప్పదండి ,జూలై 26( జనం సాక్షి): చొప్పదండి మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అనుసరించి ఎంపీపీ చిలుక రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గత వారం రోజులుగా నిర్విరామంగా పడుచున్న భారీ వర్షాలను పురస్కరించుకొని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్ పరిసరాలను, నిర్వహణ, వరద నీరు, వండుతున్న భోజనం, వర్షాకాలంలో వచ్చు వ్యాధులకు తీసుకుంటున్న నివారణ చర్యలు, దోమల మందు పిచికారి, అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది వివరాలు మొత్తం తెలుసుకున్నారు.
వర్షాకాలంలో నీరు నిలవకుండా చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనము పెట్టించాలని , టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని, దుప్పట్లు అందరికీ సరిపడా ఉంచాలని, సీజనల్ వ్యాధులు రాకుండా తగు చర్యలు తీసు కోవాలని సూచించారు.
కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సత్యం, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.