ఇన్నోవేషన్‌ వ్యాలీకి కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీ

టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో బాబు
అమరావతి,మే11(జ‌నం సాక్షి ):  ఇన్నోవేషన్‌ వ్యాలీకి కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీని మార్చేందుకు కృషిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రారంభమైన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నాలెడ్జ్‌ ఎకానవిూకి ప్రాధాన్యత ఇస్తున్నాం. నాలెడ్జ్‌ అనేది భవిష్యత్‌లో చాలా ప్రభావం చూపుతుంది. సిలికాన్‌ వ్యాలీ అంటే అమెరికాలో ఉందని అందరూ చెబుతారు. ఇన్నోవేషన్‌ వ్యాలీ అంటే ఏపీలో ఉందని చెప్పే పరిస్థితి రావాలి. ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ తయారు కావాలని’ అని సీఎం అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన మూడు నెలల్లోనే విద్యుత్‌ కొరత సమస్యను అధిగమించామన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ప్రకటించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని ఆయన గర్వంగా చెప్పారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాయంత్రం వరకు జరిగే ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 27 నుంచి జరిగే మహానాడుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, ప్రత్యేక ¬దా సహా కేంద్రం ఇచ్చిన హావిూల సాధనకు చేస్తున్న పోరాటంలో భాగంగా ప్రతి జిల్లాలో నిర్వహించనున్న సభలు తదితర అంశాలపై నాయకులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశర చేయనున్నట్టు సమాచారం.

తాజావార్తలు