ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: మంత్రి కాల్వ

అమరావతి,మే15(జ‌నం సాక్షి ): ఎపిలో రూలర్‌ హౌజింగ్‌ ఇల్ల నిర్మాణంలో వేగం పెంచాలని మంత్రి కాల్వ శ్రీనివాసులుఅధికారులను ఆదేశించారు. పేదల కోసం ఉద్దేశించిన ఈ ఇళ్ల విషయంలో తాత్సారం తగదన్నారు.  గ్రావిూణ గృహనిర్మాణంపై హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లతో మంత్రి  మంగళవారం సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారదర్శకంగా, అవినీతి రహితంగా, అత్యంత వేగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌. కిషోర్‌ కుమార్‌ రెడ్డి, ఎండీ కాంతిలాల్‌ దండే పాల్గన్నారు.

తాజావార్తలు