ఇసుక అక్రమాలను సహించేది లేదు: కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

కాకినాడ,మే2( జ‌నం సాక్షి): ఇసుక అక్రమాలను సహించేది లేదని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. ఇసుక దందాలపై  కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అలాగే నిర్వహణలో ఉన్న ఇసుక రేవుల్లో తవ్వకాలకు యంత్రాలను వినియోగించవద్దని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిర్దేశాలు, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇసుక రేవుల్లో యంత్రాలు వినియోగించవద్దని సూచించారు. ఈ నిషేధాన్ని మండల స్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందాలు కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ 
అధికారులు ఇసుక రవాణా, ఛార్జీలపై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ఆదేశించారు. లోడింగ్‌ ఛార్జీలు, రవాణా ఛార్జీలు రేవుల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.
ఉపాధి హావిూ పథకంలో జాబ్‌కార్డు ఉన్న ప్రతీ వ్యక్తికి వందరోజులు పని కల్పించాలని  ఆదేశించారు. ఉపాధి హావిూ పథకం పనులపై ఆయన  సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల కూడా ఎక్కువగా గుర్తించాలని సూచించారు. నాణ్యతతో కూడిన పనులు ప్రతిపాదించాలని ఆదేశించారు. ఈ పథకంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని సూచించారు. కూలీలకు వేతనం పెంచడం ద్వారా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కూడా పెరుగుతుందన్నారు. కూలీల వేతనాల బకాయిలు
వెంటనే చెల్లించాలని ఆదేశించారు. జులై రెండో వారానికి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా రూపొందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. 1,069 గ్రామాలకు గాను ఇప్పటికే 556 గ్రామాల్లో ఓడీఎఫ్‌ పూరి చేశారని, మిగతా గ్రామాలను కూడా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలాగే ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్‌  ఆదేశించారు.

తాజావార్తలు