ఉక్కు ఫ్యాక్టరీ హావిూని విస్మరించడం సరికాదు

కడప,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): ప్రత్యేక ప్యాకేజీతో మభ్యపెట్టిన కేంద్రం కడపలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో మూడేళ్లు దాటినా స్పస్టత ఇవ్వడం లేదని సిపిఎం నాయకులు రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలను వంచించడమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు అన్నారు. కేంద్రంలోని బిజెపి హావిూలనువిస్మరించడం దారుణమన్నారు. విభజన హావిూలను కూడా తుంగలో తొక్కిందన్నారు. రాయలసీమకు కనీసం రూ.50 వేల కోట్లు కేటాయించాలన్నారు. దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని తద్వారా వందల దళిత కుటుంబాల జీవితాలైనా బాగుపడుతాయన్నారు. విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పొందుపరిచారని, ఇక్కడున్న సంపదతో సుమారు 80 ఏళ్ల పాటు ఉక్కు పరిశ్రమకు తిరుగుండదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ ప్రాంతంపై అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గేయానంద్‌ దీక్షలు చేపడుతున్నారని చెప్పారు. వెనుకబడ్డ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రం, రాయలసీమ అభివృద్ధి చెందుతుందని బిజెపి, టిడిపి చెబుతున్నాయన్నారు. అదే వాస్తవమైతే ప్రత్యేక ¬దా కావాలని అసెంబ్లీలో టిడిపి చేసిన తీర్మానానికి బిజెపి ఎందుకు మద్దతు పలికిందని ప్రశ్నించారు.

తాజావార్తలు