ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన!

మచ్చ బొల్లారం డివిజన్ ఎయిమ్స్ ఫర్ సేవ అనాథ పిల్లల ఆశ్రమ ఆవరణలో ఓజోన్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్  ప్రధాన మంత్రి జన ఔషధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమైక్యంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.సుమారు 3000 మంది పేద ప్రజలు ఈ శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు తీసుకున్నారు. కార్యక్రమంలో ఓజోన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూరింటెండెంట్ డా ఎం.రఘునాథ్ రెడ్డి ఎజిఎం  వసుధ ఆధ్వర్యంలో వివిధ కేటగిరీల డాక్టర్లతో కలిపి మొత్తం 40 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆసుపత్రి సూరింటెండెంట్  రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 150 పడకలు గల మా ఆసుపత్రి 20 రకాలైన వైద్య సేవలతో  నిపుణులైన వైద్యులతో ప్రతి రోజు అల్వాల్ పరిసర ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజల కోసం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో ఆసుపత్రి చైర్మన్ శ్రీ సత్య సాయి ప్రసాద్, ఓపెన్ ఎన్ జి ఓ అధ్యక్షులు రమణా రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దీప్తి గడ్డం,మెడికల్ డైరెక్టర్ డా రాములు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు